నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- నిమ్మకాయలు ఎండా కాలంలో ఒంట్లో వేడిని తగ్గించడానికి తోడ్పడుతాయి.
- నిమ్మరసం యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది.
- నిమ్మలో సి విటమిన్ అధికంగా లభిస్తుంది.
- తరచూ నిమ్మరసం తీసుకుంటే చర్మం త్వరగా ముడుతలు పడదు. దీంతో వృద్ధాప్య చాయలు త్వరగా దరిచేరవు.
- ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కొంచెం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడి తగ్గి, నూతన ఉత్సాహం వస్తుంది.
- పంటినొప్పిని తగ్గించడంలో నిమ్మరసం తోడ్పడుతుంది. చిగుళ్లలోంచి రక్తం వచ్చేవారు తరచూ నిమ్మరసం తీసుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుంది.
- కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను తొలగించి, శుద్ధి చేయడంలో నిమ్మరసం సహాయపడుతుంది.
- వేసవిలో నిమ్మరసం తాగితే అలసట నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
- స్థూల కాయం ఉన్నవారు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనం ఉంటుంది.
- నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను కరిగించడంలో కూడా తోడ్పడుతుంది.