ఏపీలో పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మే 9 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. కరోనా వల్ల రెండేళ్లుగా ఏపీలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాది కరోనా కేసులు తగ్గడంతో పరీక్షలు నిర్వహించారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సమ్మెటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.
ఇక పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు పూర్తవగానే విద్యార్థులకు వేసవి సెలవులు వస్తాయని తెలిపారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కాలేజీలకు మే 25 నుంచి జూన్ 20 వరకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.