మంచి, చెడు అని మానవ శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. గుండె పనితీరును దెబ్బ తీయటంతో పాటు మరెన్నో అనారోగ్యాలకు దారి తీసే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకుని మంచి కొలెస్ట్రాల్ ను పెంచుకోవాలి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు రోజూ ఈ పండ్లను తీసుకుంటే వేగవంతమైన ఫలితం ఉంటుంది. అవి ఏ పండ్లంటే...
1.ద్రాక్ష: ద్రాక్ష పండ్లలో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని రోజుకు ఒక కప్పు మోతాదులో తినాలి.
2. పైనాపిల్: రోజూ ఒక కప్పు పైనాపిల్ ముక్కలను తినటం లేదా జ్యూస్ అయినా తాగటం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిల్లో ఉండే బ్రోమోలిన్ అనే ఎంజైమే ఇందుకు కారణం.
3. అరటిపండు: కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించడంలో పొటాషియం కూడా బాగానే పనిచేస్తుంది. ఇది అరటి పండ్లలో అధికంగా లభిస్తుంది.