ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలబంద వల్ల కలిగే ఉపయోగాలు...

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 10:06 PM

సాధారణంగా చాలా మంది ఇంట్లో పెంచుకునే మొక్కల్లో కలబంద ఒకటి. నీళ్లు కూడా చాలా తక్కువగా తీసుకుని, సులభంగా పెరిగే దీని వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ఇంట్లోనే మనం కలబంద మొక్కలను పెంచుకోవడం వల్ల ఎప్పటికప్పుడు సహజసిద్ధమైన గుజ్జు లభిస్తుంది. అందులో కాస్త నీళ్లు పోసి రసంలా తయారు చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుంటే పది రోజుల వరకు తాజాగా ఉంటుంది. దీన్ని మనకు కావల్సినప్పుడు వాడుకోవచ్చు.


కలబంద రసాన్ని కొద్ది మోతాదులో ఉదయాన్నే పరగడుపునే రోజూ తాగితే జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది. మలబద్దకం, గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. చర్మానికి కలబంద గుజ్జును రాస్తే అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లని వలయాలు పోతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com