ఎండాకాలం వచ్చిందంటేనే శరీర ఉష్ణోగ్రత ఎన్నడూలేని విధంగా పెరిగిపోతుంది. దాని వల్ల చెమట కాయలు, నోటి పుండ్లు వచ్చి తెగ ఇబ్బందిపెడుతుంటాయి. కొన్ని సార్లు గుల్లల రూపంలో వచ్చి ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఇవి ఎక్కువగా పెదవుల లోపలి వైపు లేదా నాలుకపై ఏర్పడుతుంటాయి. అయితే వీటిని కేవలం ఒక్క రోజులోనే ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందామా...
కొద్దిగా పసుపును తీసుకుని అందులో నీరు కలిపి చిక్కని పేస్ట్‌లా తయారు చేయాలి. ఆ తరువాత దాన్ని నోట్లో పుండ్లు ఉన్న చోట రాయాలి. ఇలా ఒక్క రోజు చేస్తే చాలు.. నొప్పి, మంట మొత్తం పోతాయి. రెండో రోజు చేస్తే పూర్తిగా పుండు తగ్గిపోతుంది. నోట్లో ఏర్పడే పుండ్లకు ఇది అత్యుత్తమ చిట్కాగా పనిచేస్తుంది.పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ, యాంటీ వైరల్ గుణాలే ఇందుకు కారణం.