ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొంత మామను హత్య చేయించిన వివాహిత

Crime |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 11:34 AM

సమాజంలో నానాటికీ విలువలు పతనం అవుతున్నాయి. కొందరు వివాహ వ్యవస్థ కంటే వివాహేతర సంబంధాలకే మొగ్గు చూపుతున్నారు. చివరికి కుటుంబాన్ని చేజేతులా రోడ్డుకు ఈడ్చుకుంటున్నారు. ఇంకొందరు ఏకంగా హత్యలు చేయడానికి, చేయించడానికి వెనుకాడడం లేదు. తాజాగా ఓ మహిళ తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో సొంత మామను కిరాతకంగా హత్య చేయించింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


కర్నాటకలోని రామనగర తాలూకా భైరవనదొడ్డి గ్రామ సమీపంలోని తోటలోని ఇంట్లో కాంగ్రెస్‌ నాయకుడు గంటప్ప (55) ఫిబ్రవరి 25న హత్యకు గురయ్యాడు. పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సొంత కోడలే ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలుసుకున్నారు. గంటప్ప కుమారుడు నందీష్‌తో చైత్రకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందు ఆమె నవీన్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి తర్వాత కూడా ప్రియుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇటీవల కాలంలో తనకు ఆస్తిలో వాటా ఇవ్వలేదని మామ గంటప్పపై కక్ష పెంచుకుంది. ఇక వివాహేతర సంబంధం కూడా అతడు ఉండగా కొనసాగించడం కష్టమని భావించింది. ప్రియుడు నవీన్‌తో మామను హత్య చేయించింది. బిడది పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com