ఏపీలోని కళ్యాణదుర్గంలో శుక్రవారం రాత్రి చిన్నారి మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మంత్రి ఉషశ్రీ ఊరేగింపు కోసం ట్రాఫిక్ ఆపేయడంతో ఓ చిన్నారి చనిపోవడం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. చిన్నారి ప్రాణాలు కంటే మంత్రి ఊరేగింపే ముఖ్యమని పోలీసులు భావించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రుల కడుపుకోతకు బాధ్యులెవరని ప్రశ్నించారు. బాధితులైన అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్, ఈశ్వరమ్మ దంపతులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.