వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డిపై సినీ నిర్మాత బండ్ల గణేష్ శనివారం ఫైర్ అయ్యారు. కమ్మ సామాజిక తరగతిని లక్ష్యంగా చేసుకుని విజయసాయి రెడ్డి ట్వీట్లు పెడుతుండడంపై ఆయన మండిపడ్డారు. తెలుగు దేశాన్ని అడ్డు పెట్టుకుని కమ్మ వారిని విజయసాయి రెడ్డి తిట్టడం సరికాదన్నారు. ఆయనకు ధైర్యం ఉంటే నేరుగా తిట్టాలన్నారు. కమ్మ వారందరూ టీడీపీ అనే భ్రమ వీడాలన్నారు. తాను కూడా కమ్మ సామాజిక తరగతికి చెందిన వాడినని, అయితే టీడీపీలో ఎప్పుడూ చేరలేదని స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి ఆంధ్రాకు అష్ట దరిద్రమని, కమ్మ కులాన్ని బలి చేయాలని ప్రయత్నిస్తే చరిత్ర చర్లపల్లికి దారి చూపిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రాగానే కళ్లు నెత్తికెక్కినట్లు ప్రవర్తించొద్దని హితవు పలికారు.