పాకిస్తాన్-ఆఫ్గనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దీంతో తమ సరిహద్దులోని ఆఫ్ఘన్ ప్రావిన్సులపై పాక్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల కారణంగా 30 మంది మృతి చెందారు. అయితే మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి 26 విమానాలు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు ఆఫ్ఘన్ అధికారులు ధ్రువీకరించారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ దాడులు జరిగినట్లు తెలిపారు. కాగా పాకిస్తాన్ తాము చేసిన దాడులను సమర్ధించుకుంటోంది. సరిహద్దుల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వొద్దనే తమ సూచనను ఆఫ్ఘనిస్తాన్ పట్టించుకోలేదని పేర్కొంది. పాకిస్థాన్, ఆప్ఘనిస్తాన్ దేశాల మధ్య 2,700 కి.మీ. మేర డ్యూరాండ్ లైన్ అని పిలిచే సరిహద్దు ఉంది. దీనిని తాలిబాన్లు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అయితే ఈ వైమానిక దాడులపై ఇరు దేశాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.