కంచికచర్ల మండలం పరిటాల బైపాస్ వద్ద ముందు వెళుతున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు సమాచారం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa