ఏపీలో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా చేపల వేటకు వెళ్తే ప్రభుత్వ పథకాలను అనర్హులని సర్కారు వెల్లడించింది. ఈ నెల 15 నుంచే ఈ ఉత్తర్వులు అమలులోకి వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. రెండు నెలల పాటు అంటే జూన్ 14 వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది. అయితే ఈ రెండు నెలల కాలంలో మత్స్యకారులకు జీవన భృతి కల్పించడానికి ప్రభుత్వం చేపడుతున్న నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. రూ.10 వేల చొప్పున భృతిని అందిస్తున్నట్లు తెలిపింది. గుర్తింపు పొందిన బోట్లు, పడవలపై వేట సాగించే వారికే ఈ పరిహారం అందుతుంది. దీంతో మిగిలిన వారికి కూడా పరిహారం అందించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa