పటిష్ట నిబంధనల మధ్య బయోబబుల్‌లో నిర్వహిస్తున్న ఐపీఎల్-2022ను కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన ఓ కీలక ఆటగాడు కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్‌కు మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ క్రికెటర్‌కు కరోనా వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే ఆ జట్టు తమ తదుపరి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఈ నెల 20న ఆడాల్సి ఉంది. దీనికి గానూ సోమవారమే పుణెకు వెళ్లాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ముంబైలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa