స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం బాపట్ల కలెక్టరేట్ లోని హెచ్ఆర్డిఐ సమావేశం హాల్ లో జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత వారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నూరు శాతం పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆమె చెప్పారు. ముందుగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో స్పందన అర్జీల పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌర సరఫరాలశాఖకు సంబంధించి 6 అర్జీలు పెండింగ్ లో ఉన్నట్లు చూపుతుందని వెంటనే పరిష్కరించాలని అన్నారు.
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఆన్ లైన్ లో జీరో చూపాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జి. రవీంద్ర, సి. పి. ఓ భరత్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు, జిల్లా ట్రెజరీ అధికారి శివ కామేశ్వరి , గృహ నిర్మాణ శాఖ పి. డి ప్రసాద్, జిల్లా అగ్నిమాపక అధికారి ఎ. చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జె. డి అబ్దుల్ రజాక్, మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.