విజయనగరం: జిల్లా కేంద్రంలోని శ్రీ విద్యా సర్వమంగళ దేవి పీఠాన్ని సోమవారం గిరిజన శాఖ మంత్రి , ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర దంపతులు దర్శించారు. సర్వమంగళ దేవి పీఠాధిపతి కాళిదాసు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన చండీయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజన్నదొర మాట్లాడుతూ. అమ్మవారి కరుణా కటాక్షం, ప్రజల ఆశీర్వాదంతో సోమవారం ఈ పదవులు తనకు దక్కాయని అన్నారు. అమ్మవారి దీవెనెలతో రాష్ట్ర ప్రజలందరికి సుఖ సంతోషాలు కలగాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు అలజంగి జోగరావు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa