టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కేసు నమోదైంది. ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని భాస్కర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషశ్రీ చరణ్ రిసెప్షన్ వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, దీంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ విషయాన్ని చంద్రబాబు, నారా లోకేష్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ పోస్టులు రెచ్చగొట్టేలా ఉన్నాయని భాస్కర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 153-ఎ, ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.