ఆంధ్రప్రదేశలో దారుణం జరిగింది.కాబోయే భర్త గొంతు కోసింది ఓ యువతి. ఈ ఘటన అనకాపల్లి జిల్లా రావికమతంలో సోమవారం చోటుచేసుకుంది. పెళ్లికి ఇష్టం లేని ఓ యువతి తనకు కాబోయే భర్తను గొంతు కోసింది. సర్ ప్రైజ్ అని చెప్పి కళ్లు మూసుకోమని చెప్పడంతో ఆ యువకుడి కళ్లు మూసుకున్నాడు అయితే వెంటనే చాకుతో అతని గొంతు కోసింది. ఆ యువకుడిని వెంటనే అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa