టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కేసు నమోదైంది. ఈ విషయంపై నారా లోకేష్ స్పందించారు. హత్యాయత్నంతో సహా 11 కేసులు పెట్టావు . కళ్యాణదుర్గంలో ఇప్పుడు మరో కేసు. నీలా ప్రజల సొమ్మును కాజేసినందుకు నాపై ఎలాంటి కేసులు లేవు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే నాపై కేసులు ఉన్నాయి. మంత్రి పర్యటనలో ఓవర్ యాక్షన్ చేసి ఓ దళిత బిడ్డను బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావు ... నెక్స్ట్ ఏంటి? రౌడి షీట్ ఓపెన్ చేస్తావా? నేను దేనికైనా రెడీ" అని లోకేశ్ అన్నారు.