వేసవిలో చాలా మంది వడదెబ్బ బారిన పడుతుంటారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవిలో మీ శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు గుమ్మడికాయ, దోసకాయ తినాలి. ఇవి మీ శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.
సబ్జా గింజలల్లో పీచు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల అవి శరీరంలోని వేడిని తగ్గించి చల్లగా ఉంచుతాయి.
నారింజ, నిమ్మకాయలు, వంటివి తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు బాగుంటాయి.
పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అది శరీరాన్ని చల్లగా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
వేసవిలో నిమ్మరసం తీసుకోవడం వల్ల అవి శరీరం లోపలి నుండి మీకు తాజాదనాన్ని అందించేందుకు సహాయపడతాయి. శరీరాన్ని కూల్ గా ఉంచుతాయి.
ఇంకా పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకుంటే మీకు అలసట అనేదే తెలీదు. శరీరం చల్లగా ఉంటుంది.