పోర్చగీస్ ఫుట్ బాల్ స్టార్ క్రిష్టియానో రొనాల్డో ఇంట విషాదం నెలకొంది. గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగ్జ్‌తో కవలల కోసం ఎదురుచూస్తున్న రొనాల్డోకు, ఈ మధ్యలో కవలలు జన్మించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే అందులో ఒకరు మృతి చెందడం భార్య భర్తలను దిగ్భ్రాంతికి గురి చేసింది. క్రిస్టియానో రొనాల్డో తన నవజాత కొడుకు మరణాన్ని సోషల్ మీడియా లో 19 ఏప్రిల్ 2022, మంగళవారం ఉదయం 12:40 మరణించినట్లు ప్రకటించాడు. దానితో పాటు ఆయన ఇలా రాయడం విశేషం''అప్పుడే పుట్టిన మా బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉంది.
ఏ తల్లిదండ్రులకైనా ఇది భరించలేని విషయం. పాప బతికి ఉన్న విషయం ఒక్కటే ఇప్పుడు మాకు కొంత ఆనందాన్ని ఇవ్వగలదు. ఈ సమయంలో మా వెన్నంటే ఉన్న డాక్టర్లకు,నర్సులకు ధన్యవాదాలు. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుతున్నాం''అని రొనాల్డో ఉద్వేగపూరిత మైన పోస్టును షేర్ చేశారు.