పి. గన్నవరం మండలంలోని మానేపల్లికి చెందిన వివాహిత ఇంటి నుంచి అదృశ్యమైన సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్ట పి. గన్నవరం ఎస్సై జి. సురేంద్ర సోమవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఆమె టైలరింగ్ షాపునకు వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లింది. సాయంత్రానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో పరిసర ప్రాంతాలలో గాలించారు. ఆమె ఆచూకీ తెలియక పోవడంతో భర్త సత్యనారాయణ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు