జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం సూర్య చంద్రరావుపేటలో పట్టపగలు దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడి ఆరున్నర కాసుల బంగారు నగలను అపహరించారు. పారిపోతుండగా ఓ దొంగని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. మరో దొంగ బంగారంతో పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa