ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాభాలతో ప్రారంభమై...భారీ నష్టాలతో ముగ్గింపు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:54 PM

ఈ రోజు దేశీయ మార్కెట్ ఇన్వేస్టర్లకు పెద్దగా కలసిరాకపోగా భారీ నష్టాలను మిగిల్చాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత స్వల్ప నష్టాలు, లాభాల్లో కొనసాగుతూ వచ్చాయి. అయితే ట్రేడింగ్ చివరి అరగంటలో ఒక్కసారిగా కుప్పకూలాయి. 


ఐటీ, ఫైనాన్సియల్, కన్జ్యూమర్ గూడ్స్ స్టాకులు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బలహీనంగా వస్తున్న కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మదుపరులపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 703 పాయింట్లు నష్టపోయి 56,463కి పడిపోయింది. నిఫ్టీ 215 పాయింట్లు కోల్పోయి 16,958కి దిగజారింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:


రిలయన్స్ (3.71%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.44%), బజాజ్ ఫైనాన్స్ (0.25%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.16%). 


టాప్ లూజర్స్:


హెచ్డీఎఫ్సీ (-5.50%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-3.73%), ఇన్ఫోసిస్ (-3.55%), ఐటీసీ (-3.33%), టెక్ మహీంద్రా (-3.17%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com