వ్యాపారం మెరుగు కోసం శతకొటి ప్రయత్నాలు అంటరు. తాజాగా హోండా కార్స్ ఇండియా తన కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ప్రకటించింది. ఏప్రిల్ 30, 2022 వరకు హోండా సిటీ, అమేజ్, డబ్ల్యూఆర్-వీ , జాజ్ కార్లపై రూ.33 వేల వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయనున్నట్టు హోండా కార్స్ తెలిపింది. హోండా కార్లపై కంపెనీ ఆఫర్ చేస్తోన్న డిస్కౌంట్ల వివరాలు..
న్యూ జనరేషన్ హోండా సిటీ..
5వ జనరేషన్‌కు చెందిన హోండా సిటీపై కంపెనీ రూ.30,396 వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. దీనిలో రూ.5 వేల క్యాష్ డిస్కౌంట్, రూ.7 వేల హోండా కారు ఎక్స్చేంజ్ బోనస్, రూ.8 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. అంతేకాక రూ.5 వేల హోండా కస్టమర్ లాయల్టీ బోనస్ కూడా ఉంది. నగదు డిస్కౌంట్ ఇస్తున్నప్పటికీ.. కంపెనీ రూ.5,396 యాక్ససరీలను ఉచితంగా అందిస్తోంది. 4వ జనరేషన్‌కు చెందిన హోండా సిటీపై రూ.20 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీనిలో రూ.7 వేల కారు ఎక్స్చేంజ్ బోనస్, రూ.8 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. దీంతో పాటు రూ.5 వేల లాయల్టీ బోనస్‌ను కస్టమర్లు పొందవచ్చు.
హోండా అమేజ్..
హోండా ఇండియా లైనప్‌లో బెస్ట్ సెల్లింగ్ సెడాన్‌గా దీనికి పేరుంది. అమేజ్‌పై కంపెనీ రూ.15 వేల వరకు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచింది. దీనిలో రూ.4 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.6 వేల కారు ఎక్స్చేంజ్ బోనస్ ఉన్నాయి.
హోండా డబ్ల్యూఆర్-వీ..
ఈ నెలలో డబ్ల్యూఆర్-వీ వెహికిల్‌పై హోండా రూ.26 వేల వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. దీనిలో రూ.4 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.7 వేల ఎక్స్చేంజ్ బోనస్‌లను ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు కారు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ రూ.10 వేలు ఉంది. ప్రస్తుత కస్టమర్లకు లాయల్టీ బోనస్ రూ.5 వేల వరకు అందుబాటులో ఉంది.
హోండా జాజ్..
హోండా జాజ్‌పై కంపెనీ గరిష్టంగా రూ.33,158 వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ డిస్కౌంట్లో నగదు డిస్కౌంట్ రూ.10 వేల వరకు ఉంది. లేదా రూ.12,158 విలువైన ఉచిత యాక్ససరీలనైనా ప్రజలు తీసుకోవచ్చు. అంతేకాక రూ.4 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.5 వేల కారు ఎక్స్చేంజ్ డిస్కౌంట్, రూ.5 వేల హోండా కస్టమర్ లాయల్టీ బోనస్లున్నాయి. అదనంగా రూ.7 వేల ఎక్స్చేంజ్ బోనస్‌ను కస్టమర్లు పొందవచ్చు.