ఇటీవల అనంతపురం జిల్లాలో పర్యటించి ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23న పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పవన్ పర్యటిస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ నెల 23న ఉదయం 9 గంటలకు ఏలూరు బైపాస్ మీదుగా చింతలపూడికి వెళ్లనున్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన తరపున లక్ష రూపాయల చొప్పున సాయం అందిస్తామన్నారు. ఆపై చింతలపూడిలో జరిగే రచ్చబండ సభలో పాల్గొంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa