టీటీడీ పలు ప్రాంతాలలో శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జమ్మూలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్మిస్తున్న ఈ ఆలయ పనులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ కొనసాగుతున్న పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆలయ నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆయన అక్కడి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వైవీ సుబ్బారెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa