ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒంగోలు లో వైయ‌స్ఆర్‌ సున్నా వడ్డీ మూడో విడత ప్రారంభానికి సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 11:59 AM

 ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈనెల 22వ తేదీ శుక్రవారం ఒంగోలులో ప‌ర్య‌టించ‌నున్నారు.  వైయ‌స్ఆర్‌  సున్నా వడ్డీ మూడో విడత ప్రారంభ కార్యక్రమాన్ని ఒంగోలు నుంచి చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ పర్యటన వివరాలను తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం ఖరారు చేసింది.


ముఖ్యమంత్రి అదనపు పీఎస్‌ కే.నాగేశ్వరరెడ్డి విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ నెల 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసం నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని హెలిప్యాడ్‌ వద్దకు వెళతారు. హెలిప్యాడ్‌ నుంచి 9.40 గంటలకు హెలిక్యాప్టర్‌లో ఒంగోలుకు బయలుదేరుతారు. ఉదయం 10.10 గంటలకు ఒంగోలు నగరంలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న ఏబీఎం గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలిక్యాప్టర్‌ చేరుకుంటుంది. 10.25 గంటల వరకు ఏబీఎం గ్రౌండ్‌లోనే స్థానిక నాయకులతో, అధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 10.40కి ఏబీఎం నుంచి రోడ్డు మార్గం ద్వారా రంగారాయుడు చెరువు వద్ద ఉన్న పీవీఆర్‌ మున్సిపల్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa