దివంగత నేత అవనిగడ్డ, మచిలీపట్నం మాజీ శాసన సభ్యులు మరియు మచిలీపట్నం మాజీ ఎంపీ స్వర్గీయ అంబటి బ్రాహ్మణయ్య 9 వర్ధంతి సందర్భంగా నాగాయలంకలోని అంబటి బ్రాహ్మణయ్య విగ్రహానికి అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు అంబటి బ్రాహ్మణయ్య తనయుడు మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరి ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అంబటి బ్రాహ్మణయ్యను స్మరించుకుంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భోగాది శేషగిరిరావు, నాగాయలంక జడ్పిటిసి మోకా బుచ్చిబాబు స్టేట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ డైరెక్టర్ మద్ది చిన్నా, వక్కపట్లవారిపాలెం గ్రామ సర్పంచ్ అంబటి శ్యామ్ ప్రసాద్ మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa