ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 21, 2022, 04:02 PM

ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న రేషన్ సరకుల వివరాల పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కేతన్ కార్డ్ పేర్కొన్నారు. రాప్తాడు లోని అనంతపురం అర్బన్ స్టాక్ పాయింట్ ను బుధవారం ఆయన తనిఖీ చేసి నిల్వ వివరాలను పరిశీలించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎస్ డీటీ, డీఎంసీఎస్ అధికారులు నిత్యం స్టాక్ వివరాలను తనిఖీ చేస్తూ, హెచ్చు తగ్గులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టాక్ వివరాల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఈరమ్మ, సిబ్బంది పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa