చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జరవారిపల్లి పంచాయతీ పి. ఒడ్డూరు గ్రామంలో కే ఆనందయ్య వరి పంటను పందులు నాశనం చేశాయి. ఈ మధ్యకాలంలో పంటలపై ఏనుగులు, పందులు తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారులు ఏనుగులును నివారించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.. అటవీశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ మధ్యకాలంలో ఏనుగులు ,పందులు పంటల పై దాడులు చేస్తుండడంతో రైతులు చాలా నష్టపోతున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం బిందు సేద్య పరికరాలను అందించడంలో పూర్తిగా విఫలమైందని రైతుల ఆందోళన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa