విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి తానేటి వనిత.. ఐజీ, సీపీలతో ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 'నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలి. మహిళలపై నేరాల విషయంలో అలసత్వం వహించొద్దు' అని ఆమె ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa