అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామ సమీపంలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట అడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 9 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ఎవరైనా గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa