ఉత్తరప్రదేశ్లోని ఫతేహాబాద్ ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ కు ఓ దొంగా షాక్ ఇచ్చాడు.. ఉత్త కాళ్లతో రోడ్డుపై నడిపించారు. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే ఛోటేలాల్ వర్మ ఆగ్రాలో సతీమాత ఉత్సవాలను ప్రారంభించేందుకు శుక్రవారం వచ్చారు. ఆయన వెంట భారీగా పార్టీ నాయకులు, అనుచరులు తరలి వచ్చారు.
దైవదర్శనం కోసం గుడి లోపలికి ఎమ్మెల్యే బూట్లు విడిచి వెళ్లారు. పూజల అనంతరం తిరిగిన వచ్చిన ఎమ్మెల్యేకు తన బూట్లు కనపడ లేదు. ఎంత వెతికినా దొరకకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. చెప్పులు లేకుండా ఉత్త కాళ్లతోనే నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన పరిస్థితిని చూసి సదరు ఎమ్మెల్యే నవ్వుకుంటూ వెళ్లిపోవడంపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.