తనను విశాఖ జిల్లా బాధ్యతల నుంచి తప్పించి అనుబంధ సంఘాల ఇంఛార్జ్‌గా నియమించడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. 'నాకు ఇది కావాలి. ఇది వద్దు అనే ప్రస్తావన ఎప్పుడూ లేదు. చార్టెడ్ అకౌంటెంట్ అయిన నాకు జగన్ చాలా అవకాశాలు ఇచ్చారు. అధినేత ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడమే నా బాధ్యత. కాంగ్రెస్‌తో పొత్తుపై జగన్ స్పందిస్తారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరు మద్దతిస్తే వారికే మా మద్దతు ఉంటుంది' అని విజయసాయిరెడ్డి చెప్పారు.