మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో శుక్రవారం స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పడకూడదనే సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. గతంలో రెండు విడతల్లో వడ్డీ రాయితీ నిధులు ఇవ్వగా, ఇప్పుడు మూడో విడతగా 31, మండలాలు, 4 మున్సిపాలిటీలు, ఒక నగరపాలక సంస్థ పరిధిలోని 38, 880 సంఘాలకు రూ. 71. 76 కోట్లు సున్నా వడ్డీ మొత్తాన్ని పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.
అనంతరం మహిళలకు సున్నా వడ్డీ చెక్కులు పంపిణీ చేశారు. ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్, డీసీసీబీ ఛైర్‌పర్సన్ రెడ్డెమ్మ, కలెక్టర్ హరినారాయణన్, చిత్తూరు మేయర్ అముద, పీఎంకే ఉడా ఛైర్మన్ వెంకటరెడ్డి, జానపద కళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం, ఆర్డీవో రేణుక, జడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి, చిత్తూరు కమిషనర్ అరుణ, మెప్మా పీడీ రాధమ్మ, సంబంధిత అధికారులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.