ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికకు మాయమాటలు చెప్పి అటోడ్రైవర్ అత్యాచారం చేసిన సంఘటన కంచికచర్ల మండలంలోని పరిటాలలో చోటు చేసుకుంది. ఈనాడు కథనం ప్రకారం.. కంచికచర్లకు చెందిన బాలిక ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. పరిటాలకు చెందిన బొంత సాంబశివరావు ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పటికే అతనికి వివాహం అయినట్లు తెలియడంతో మోసపోయినట్లు గ్రహించిన బాలిక.. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.