రీ సర్వే కార్యక్రమం అత్యంత సున్నితమైనదని, ఏకాగ్రతతో పని చేసి ఏటువంటి వాళ్లు ఇబ్బందులు లేకుండా లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. కలెక్టర్ శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి రీ సర్వే మీద రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, పి ఓ ఎల్ ఆర్ సక్రమంగా చేసి ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావని, సున్నితమైన రీ సర్వే కార్యక్రమం లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఏకాగ్రతతో పని చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్ రెడ్డి, సర్వే ఇన్స్పెక్టర్ లత, సదుం తాసిల్దారు గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.