గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాధనకు గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీసుకు రావడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు కె. నారాయణ స్వామి పేర్కొ న్నారు. శనివారం గంగాధర నెల్లూరు నియోజక వర్గ పరిధిలోని కార్వేటి నగరం మం డలం ఎంపీడీఓ కార్యాలయ ఆవర ణoలో కార్వేటి నగ రం మండలానికి సంబంధించి వాలంటీర్లకు వందనం కార్య క్రమం లో భాగంగా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులకు ఎంపిక కాబడ్డ వాలంటీర్లకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమ మునకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖ మాత్యులు పాల్గొని వాలంటీర్లకు సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నవ రత్నా లను అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేయడంజరుగుతున్నదన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చడం జరుగుతుందన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం సాధనకు గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ను, వాలం టీర్ల వ్యవస్థ ను తీసుకు రావడం జరిగిందనన్నారు. ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలను పార దర్శకంగా అందిం చేందుకు వాలంటరీ వ్యవస్థ తొడ్పడు తున్నదన్నారు. వాలంటీర్ల సేవా దృక్పథంతో పని చేస్తున్నందున వారికి ప్రోత్సాహక అవార్డు లను అందించడం జరుగుతుందన్నారు.
నాటు సారా తయా రీని పూర్తిగా నిర్మూలి స్తామని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్వేటి నగరం మండలానికి సంబంధించి వాలం టీర్లకు వందనం కార్యక్రమం లో భాగంగా సేవా మిత్ర గా ఎంపిక కాబడ్డ 230 మంది కి మరియు సేవా రత్న గా ఎంపిక కాబట్టి 5 మందిలో పలువురికి రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి గారి చేతుల మీదుగా అవార్డుల ప్రధానోత్సవం తో పాటు సన్మానించి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద కార్వేటి నగరం మండలం నకు చెం దిన 1049 స్వయం సహాయక సంఘాల కు రూ. 1, 82, 00, 000/- మెగా చెక్కును స్వయం సహా యక సంఘాల మహిళలకు మరి యు 1266 మంది జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద సంబంధింత పత్రా లను అతిధుల చేతుల మీదుగా లబ్ది దారులకు అంద జేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభి షేకం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ లత, ఎంపీ డీఓ చిన్నరెడ్డెప్ప, డిటి లక్ష్మీపతి, వ్యవ సాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ యాదవ్, ఎపిఓ విజయ్ కుమార్, సంబంధింత అధి కారులు, నాయకు లు బాలాజీ, ప్రభాకర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, లోకనాథ్ రెడ్డి, ధనుంజయ వర్మ, బండి జగదీష్, వెంకట రత్నం, ప్రభాకర్, ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.