మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపేటలో నీటి కష్టాలు తప్పడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో మారుమూల నివశించే వారికి నీటి కష్టాలు ఉన్నాయని వింటూ ఉంటాం. కానీ నగరపాలక సంస్థ కు కూతవేటు దూరంలో నీటి కష్టాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపేట (1వ వార్డు) చర్చి ప్రాంతంలో ఓవర్ హెడ్ ట్యాంకు నుండి క్రిందకు వచ్చే నీరు ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చడం లేదు. నీరు దిగువకు వచ్చే క్రమంలో ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 20 కుటుంబాలకు అందకుండా నేరుగా క్రిందలైనుకు వెళుతుందని చెబుతున్నారు. గతంలో సమస్యను నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఫిట్ వాల్ వద్ద నుండి క్రిందకు లైను ను వేసి అక్కడి నుండి ఈ 20 కుటుంబాలకు కనెక్షన్లు ఇస్తే నీరు సక్రమంగా వస్తుందని తెలిపారని అయినప్పటికీ నేటికి సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) ప్రత్యేక చోరవ చూపి సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నరు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో నీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.