కర్ణాటక మంగళూరు కుంబాలకు చెందిన అన్విత్ కుమార్ దృష్టి లోపంతో బాధపడుతున్నాడు. అయినా కష్టపడి పట్టుదలతో చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించాడు. మంగళూరు యూనివర్సిటీ నుంచి రాజకీయ శాస్త్రంలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థిగా నిలిచాడు.
అన్విత్ తాను ఆరో తరగతిలో ఉన్నప్పుడు కంటిచూపును పోగొట్టుకున్నాడు. తల్లి ప్రోత్సాహంతో చదువులో ముందడుగు వేసి మెరుగైన మార్కులు సాధించాడు. పదో తరగతి వరకు బ్రెయిలీ లిపిలో చదువుకున్నాడు. ఆ తర్వాత సాధారణంగానే విద్యను అభ్యసించాడు. అతడికి తల్లితో పాటు సహచర విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు. సహాయకులతో పరీక్షలకు హాజరైన అన్విత్ టెన్త్ లో 87శాతం, పీయూసీలో 88 శాతం, బీఏలో 89 శాతం, ఎంఏలో 82 శాతం మార్కులు పొందాడు. బీఏ, ఎంఏలో గోల్డ్ మెడల్స్ సాధించాడు. ప్రొఫెసర్ కావడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు.