ముస్లింలు జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లడం ఇస్లాం మత ధర్మాల్లో ఒకటి. ఇదిలావుంటే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది పలు షరతులతో హజ్ యాత్రకు సౌదీ అరేబియా ఆమోదం తెలిపింది. భారత్ నుంచి 79,237 మందికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతి నిచ్చింది. పరిస్థితుల దృష్ట్యా 65 ఏళ్లకు పైబడిన వారికి హజ్ యాత్రకు అనుమతి నిరాకరించింది.
అంతేకాదు, హజ్ యాత్రకు వచ్చేవారు 2 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్టు నిర్ధారణ పత్రం, కరోనా ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు వెంట తీసుకురావాల్సి ఉంటుందని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది హజ్ యాత్ర జులై 7న మొదలై 12వ తేదీన ముగియనుంది.