పవన్ కళ్యాణ్ తో తాను కలసి దిగిన ఫోటోపై మంత్రి గుడివాడ అమర్నాథ్ తనదైన శైలీలో వ్యంగ్యంగా స్పందించారు. ఇదిలావుంటే జనసేనాని పవన్ కల్యాణ్ పై ఇటీవల ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం తెలిసిందే. బహు భార్యత్వం అంటూ పవన్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది. అందులో పవన్ కల్యాణ్ తో గుడివాడ అమర్నాథ్ ఉన్నారు.
ఇదిలావుంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ పట్ల అమర్నాథ్ స్పందించారు. "కొంతమందిలా పవన్ ఎవరో నాకు తెలియదు అని నేను అనను. జగన్ నాకు ఇచ్చిన ఇమేజ్ తో నాతో కూడా చాలామంది ఫొటోలు దిగుతారు. పవన్ కల్యాణ్ కూడా అదే విధంగా చేసి ఉండొచ్చు" అంటూ తనదైన రీతిలో వివరణ ఇచ్చారు. ఇదిలావుంటే గుడివాడ అమర్నాథ్ ఉన్న ఆ ఫొటోలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa