పదోతరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఎంఈవో కె. సురేఖ తెలిపారు. పోలీసు శాఖ ద్వారా పరీక్ష కేంద్రాల వద్ద గట్టిగా భద్రతా ఏర్పాటు చేస్తామని, పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీ నుంచి పది పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9. 30 గంటల నుంచి మధ్యా హ్నం 12. 45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎక్కడా జిరాక్స్ కేంద్రాలు ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష కేంద్రాలను విద్యార్థులు ఒక గంట ముందే రావాలన్నారు.