బాపట్ల జిల్లా మెదరమెట్ల- అద్దంకి నార్కెట్పల్లి నామ్ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను కడప నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ తిరగబడటం తో డ్రైవర్ కు గాయాలయ్యాయి. కారులో బెలూన్లు ఓపెన్ కావటం తో కారులో ఉన్న వారికి ఏమీ కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa