గుంటూరు: యనమదల గ్రామానికి చెందిన, కొట్నాల అరుణ భర్త పెద్ద వీరయ్య, అత్తమామలతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇంటి పనులు, పశుపోషణ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అత్తమామలకు పనులు చేసే విషయమై భార్యాభర్తలిద్దరికీ మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఈనెల 20న అరుణ ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో భర్త పత్తిపాడు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు.