తిరుమలలోని బార్బర్ క్వార్టర్స్ కు సమీపంలో రాత్రి ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి భక్తుడు మృతి చెందారు. గుంటూరు జిల్లా పెద్ద వడ్లపూడికి చెందిన గోపాలకృష్ణమూర్తి ( 70 ) కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం వచ్చారు. రాత్రి ఆలయం వద్ద తప్పిపోయాడు. ఇతనికి కళ్లు సరిగా కనిపించవు. చెవులు సరిగా వినిపించవు. ఈ క్రమంలో జారిపడి తలకు తీవ్ర గాయమై మృతి చెందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa