దేశం నుంచి పలు అంతర్జాతీయ వాహన తయారీ సంస్థలు వెళ్లిపోతున్నాయని.. అందుకు కేంద్రప్రభుత్వ తీరే కారణమంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. హేట్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఒకేసారి మనుగడ సాగించలేవని విమర్శించారు. '7 గ్లోబల్ బ్రాండ్స్, 9 ఫ్యాక్టరీలు, 649 డీలర్‌షిప్స్, 84000 ఉద్యోగాలు పోయాయ్. నిరుద్యోగ సంక్షోభంపై ప్రధాని మోదీ దృష్టి సారించాలి' అంటూ విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు.