రైల్వేకోడూరు పట్టణం నందు రైల్వేకోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న దాడులు, నేరాలపై బుధవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి భారీ ర్యాలీగా బయలుదేరి గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి మహాత్మా గాంధీ విగ్రహంనకు వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా కస్తూరి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ సీఎం రాష్ట్రాన్ని అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారన్నారు. ఆడబిడ్డకు రక్షణగా నిలవాల్సిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత మరిచి బాధితులకు అండగా నిలబడుతున్న విపక్ష తెలుగుదేశం పార్టీపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతుండడం చాలా దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో యువతిని గ్యాంగ్ రేప్ చేస్తే నిందితుడు వెంకటరెడ్డిని నేటికీ అరెస్టు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాలు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa