ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాక్నే లేని ముఖారవిందం కోసం...

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 09:03 PM

చందమామకైనా మచ్చ వుంటే ఫర్వాలేదు కానీ ఆడవారి ముఖం మీద మచ్చ కానీ, మొటిమ కానీ వస్తే అస్సలు తట్టుకోలేరు. అలాంటప్పుడు  ముఖంపై యాక్నే(మొటిమలు) రాకుండా ఉండాలంటే వారానికొకసారైనా ఇలా చేసి చూడండి... మొటిమన్నదే మీ ముఖం పై రాదు. దీనికి మీరు చేయవలసిందల్లా తాజా వేపాకులను తీసుకుని మెత్తని ముద్దలా మిక్సీ పట్టుకోండి. ఈ క్రమంలోనే పసుపు, కొంచెం నీరు యాడ్ చెయ్యండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి స్మూత్ గా అప్లై చేయండి. ముందుగా ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకున్న తర్వాత ఈ మిశ్రమం రాస్తే ఇంకా మంచిది. ఒక అరగంట పాటు అలానే ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేసుకోండి. అంతే... తరచూ ఇలా చెయ్యటం వల్ల మీ ముఖం మొటిమలు, మచ్చలు లేకుండా ఎంతో ఫ్రెష్ గా, నీట్ గా కనిపిస్తుంది. మొటిమలు వచ్చిన తర్వాత కాకుండా రాకముందే ఇలా తరచూ చేస్తుంటే మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com