ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు మంత్రి పదవిని నిలబెట్టుకున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఏపీ విద్యాశాఖ షాక్ ఇచ్చింది. రెండు మంత్రిత్వ శాఖల పీఏ, పీఎస్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను విద్యాశాఖ బాధ్యతల నుంచి తప్పించింది. వారిని తిరిగి విద్యాశాఖకు రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది.ప్రజాప్రతినిధుల వద్ద ఉపాధ్యాయులు పీఏ, పీఎస్లుగా కొనసాగరాదని గతంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.గురువారం మొత్తం 26 మంది ఉపాధ్యాయులను ప్రజాప్రతినిధుల వద్ద వ్యక్తిగత సిబ్బంది పోస్టుల నుంచి రీకాల్ చేశారు.