ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా పరిహారాన్ని ఇతర పథకాలకు మళ్లించిందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కరోనా మృతుల కుటుంబాలకు అందించే కరోనా నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 1,100 కోట్ల దుర్వినియోగం జరిగిందని ఆరోపించింది. మే 13లోగా పరిహారం వివరాలతో అఫిడవిట్‌ను దాఖలు చేయాలని రాష్ట్ర సిఎస్‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే చివరి అవకాశం అని హెచ్చరించింది.